విద్యా ప్రమాణాలు పెంపొందించాలి

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

విద్యా ప్రమాణాలు పెంపొందించాలి
– విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
– జిల్లా అడిషనల్ కలెక్టర్ ఉమా హారతి
– ప్రభుత్వ నెంబర్ 2 పాఠశాల సందర్శన
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంపొందేలా చూడాలని వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఉమా హారతి అన్నారు. శనివారం పాఠశాలల రాష్ట్ర పరిశీలన బృందంతో కలిసి తాండూరు పట్టణం పాత తాండూరులోని ప్రభుత్వ నెంబర్ -2 పాఠశాలను అడిషనల్ కలెక్టర్ ఉమా హారతి సందర్శించారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో మాట్లాడి పఠనా సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రతి విద్యార్థితో అప్యాయంగా మాట్లాడి విద్యను ఎలా అందిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పాఠశాలల ఉపాధ్యాయులతో బోధన గురించి ఆరా తీశారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేలా విద్యనందించాలని సూచించారు.

ప్రతి విద్యారి చదువుపై ఉపాధ్యాయులు దృష్టిసారించాలన్నారు. అంతేకాకుండా విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని సూచించారు. మరోవైపు పాఠశాలకు సొంత స్థలంలో భవనం ఏర్పాటు చేసే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరిశీలన బృందం ప్రతినిధులు అభిజిత్, సంతోష్, విద్యాధికారి వెంకటయ్య గౌడ్, హెచ్ఎం ప్రతిభా భారతి తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

జిల్లా ఎస్పీని కలిసిన శ్రీనివాస్‌ రెడ్డి