తెలంగాణ ఉద్యమ స్పూర్తి ప్రదాత

తాండూరు రాజకీయం వికారాబాద్

తెలంగాణ ఉద్యమ స్పూర్తి ప్రదాత
– శ్రీసాయి మేధాలో జయశంకర్‌ సారుకు నివాళులు
– జయంతిలో స్మరించుకున్న టీచర్లు, విద్యార్థులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ఉద్యమ స్పూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం మండల తాండూరు పట్టణం శివాజీ చౌక్ లోని శ్రీ సాయి మేధ విద్యాలయలో కరస్పాండెంట్ పెరుమళ్ల వెంకట్ రెడ్డి, ప్రిన్సిపల్ సజిత, వైస్ ప్రిన్సిపాల్ నవీన్ కుమార్ తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాధనలో సిద్ధాంతకర్త జయశంకర్ సార్ అలుపెరగని పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధనకు బాటలు వేశాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆయన్ను ఎల్లవేళలా స్మరించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

విద్యార్థులు చిన్ననాటి నుంచి దేశభక్తి, దైవభక్తి పెంపొందించుకోవాలని సూచించారు. మన దేశ చరిత్ర తో పాటు రాష్ట్ర చారిత్రను విద్యార్థులు క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. అమరుల త్యాగాలను గుర్తుపెట్టుకొని వారి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు.

ఇదికూడా చదవండి…

సదరం క్యాంపు షెడ్యూల్‌ విడుదల