దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న
తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి: కర్ణాటక రాష్ట్రం గాన్గాపూర్‌లో వెలసిన శ్రీ దత్తాత్రేయ స్వామిని తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ దర్శించుకున్నారు. తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్‌గా బుధవారంతో ఏడాది పదవికాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలయంలో వెలసిన దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పాడి పంటలు సమృద్ధిగా పండి సుఖసంతోషాలతో ఉండాలని ఆ దత్తాత్రేయ స్వామిని కోరుకున్నట్టు తెలిపారు. అధిక వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రైతులు పండించిన ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు త్వరలోనే నియోజకవర్గ పరిధిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. అదేవిధంగా మార్కెట్ కమిటి చైర్మన్‌గా మరోసారి అవకాశం కల్పించిన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
