ఈఏపీసెట్ లో తాండూరు అమ్మాయి సత్తా..!

కెరీర్ తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

ఈఏపీసెట్ లో తాండూరు అమ్మాయి సత్తా..!
– రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించిన నవ్య రెడ్డి
– హర్షం వ్యక్తం చేసిన ఫ్యామిలీ, టీచర్స్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో ప్రకటించిన ఈఏపీసెట్ పరీక్ష ఫలితాలలో తాండూరుకు చెందిన విద్యార్థిని సత్తా చాటింది. రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించి ఆదర్శంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే… యలాల మండలం బెన్నూరు గ్రామానికి చెందిన పి. శ్రీనివాస్ రెడ్డి కూతురు నవ్యరెడ్డి ఈఏపీసెట్ పరీక్ష రాసింది. శనివారం విడుదలైన పరీక్ష ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో 864 ర్యాంకు సాధించింది. ఆమె ప్రతిభను అందరు అభినందించారు. నవ్యరెడ్డి తాండూరులోని అక్షర స్కూల్లో పదో తరగతి, భాష్యం కాలేజీలో ఇంటర్ పూర్తి చేసింది. తమ విద్యార్థి ఈఏపీసెట్ లో సత్తా చాటడం పట్ల అక్షర స్కూల్ ప్రిన్సిపల్ మోహన్ గౌడ్, టీచర్లు హర్షం వ్యక్తం చేశారు.

 

 

 

ఇదికూడా చదవండి…

 

మహిళ సెల్‌ ఫోన్‌ గుర్తింపు