కంట్లో కారం చల్లి, చీరతో ఉరేసీ..!
– ఆపై పెట్రోల్‌తో దహసం చేసి హత్య
– డబ్బు, వడ్డీ అడుగుతుందని దారుణం
– వీడిన శంషాబాద్ మహిళ మర్డర్ మీస్టరీ
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : అప్పుగా తీసుకున్న డబ్బులతో పాటు వడ్డీ అడుగుతుందని ఒంటరి దొరికిందని దారుణానికి పాల్పడ్డారు నిందితులు. మహిళ కంట్లో కారం చల్లి.. చీర కొంగుతో ఉరేశారు. అంతటితో ఆగకుండా పెట్రోల్ పోసి మృతదేహాన్ని దహనం చేశారు. శంషాబాద్‌లో సంచలనం సృష్టించిన మహిళ మర్డర్ మిస్టరీ వీడింది. హత్యకు గురైన మహిళ ఆచూకీకి పోలీసులు కనిపెట్టగా హతురాలును మంజులగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ మండలం రాల్లగూడకు చెందిన మంజుల వద్ద కొన్నాళ్ల క్రితం రిజ్వాన రూ.లక్ష అప్పుగా తీసుకున్నారు. రెండు నెలలుగా రిజ్వానా వడ్డీ చెల్లించడం లేదు. ఈ క్రమంలో ఈ నెల 10న రిజ్వాన ఇంటికి వెళ్లిన మంజుల, ఆమె భర్త డబ్బులు తిరిగి ఇవ్వాలని గట్టిగా అడిగారు. దీంతో నిందితురాలు రిజ్వాన వారిపై కక్ష పెంచుకుంది. మరోసారి డబ్బులు తిరిగి ఇవ్వమని మంజుల అడగడంతో వారి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.
కడుపు నొప్పిగా ఉందని ఇంటి నుంచి ఆసుపత్రికి బయల్దేరిన మంజులను ఒంటరిగా చూసిన రిజ్వానా కంట్లో కారం చల్లి తర్వాత చీరకొంగుతో ఉరి వేసి హత్య చేసింది. హత్య అనంతరం మంజుల ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను నిందితురాలు తీసుకుంది. అదే రోజు అర్ధరాత్రి సమయంలో మృతదేహాన్ని తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆర్థిక లావాదేవీలే మంజుల హత్యకు కారణమని పోలీసులు నిర్ధరణకు వచ్చారు. మంజుల మృతదేహాన్ని గుర్తుపట్టకుండా ఉండేందుకు నిందితులు పెట్రోల్ పోసి కాల్చేసినట్లు తేల్చారు. హత్య కేసులో నిందితురాలు రిజ్వానతో పాటు హత్యకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి..

