పోలీసుల సేవలు అజరామరం
– ప్రెండ్లీ పోలీసింగ్‌తో తగ్గిన నేరాలు
– వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
– పోలీసు సంస్మరణలో అమరులకు శ్రద్దాంజలి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు పునరంకితమైన పోలీసుల సేవలు అజరామరంగా నిలుస్తాయని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఎస్పీ కార్యాలయం పరేడ్ మైదానంలో వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ హాజరై పోలీసు అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా ఆస్తుల సంరక్షణ, సంఘవిద్రోహ కార్యకలాపాలను అరికట్టేక్రమంలో బంధాలను బంధుత్వాలను చివరకు ప్రాణాలను
సైతం ప్రజాక్షేమానికోసం వదిలి అసువులు బాసిన పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివి వారు చిరస్మణీయులు అన్నారు.తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అత్యాధునిక సాంకేతికను అందిపుచ్చుకుని నేరాల నియంత్రణకు కృషి చేయడం అభినందనీయని.. వారి సేవలకు అందరు సెల్యూట్ చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా సర్కారు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో హింస, క్రైంరేట్ తగ్గుముఖం పట్టిందన్నారు. కరోనా కష్టతరమైన పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి పోరాడిన పోలీసులు అందించిన సేవలకు ప్రజలు రుణపడి ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిఖిల, ఎస్పీ నారాయణ, అడిషల్ పోలీస్ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.


