అన్నదానం ఎంతో గొప్పది
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: అన్ని దానాలలో అన్నదానం ఎంతో గొప్పదని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్ అన్నారు. గురువారం తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులోని లాల్ బేగ్ బాబా ఆలయం వద్ద వాల్మీకీ మేతర్ ప్రగతి సమాజ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ వార్డు కౌన్సిలర్ బొంబీనాతో కలిసి హాజరై అన్నదానం చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మాట్లాడుతూ అన్ని దానాలలో అన్నదానం ఎంతో గొప్పదన్నారు. వాల్మీకీ మేతర్ సమాజ్ వారు అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయన్నారు. అనంతరం వాల్మీకీ మేతర్ సమాజ్ సభ్యులు చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కౌన్సిలర్ బొంబీనాను శాలువా, పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సమాజ్ సభ్యులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.
