గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి
– అపోహలు, అసత్య ప్రచారాలను నమ్మొద్దు
– చవితి, నిమజ్జన వేడుకలపై ప్రత్యేక నిఘా
– ఐక్యమత్యంతో ఉంటే శాంతి వాతావరణం
– వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి సూచించారు. బుధవారం తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని దుర్గా గ్రాండ్యూర్ లో శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డితో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, ప్రజా ప్రతినిధులు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు, ముస్లిం మత పెద్దలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ వచ్చే వినాయక చవితి ఉత్సవాలను ప్రజలందరు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలన్నారు.
చవితి, నిమజ్జన ఉత్సవాలలో కొందరు ఆకతాయిలు సృష్టించే వధంతులు, అసత్య ప్రచారాలను నమ్మొద్దన్నారు. తాండూరు అంటేనే మతసామరస్యతను చాటుతుందని, దానిని అందరు కాపాడుకోవాలన్నారు. అదేవిధంగా వినాయకులు ప్రతిష్టించే వారు అనుమతులు పొందాలన్నారు. మండపాల వద్ద డీజే, సౌండ్ లతో ఇతరులను ఇబ్బందులు పెట్టరాదన్నారు. నిమజ్జనం రోజున వినాయకులను త్వరగా తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. త్వరగా తరలిస్తేనే అందరు వినాయకులను చూస్తారని అన్నారు. వినాయక ఉత్సవాలపై సీసీ నిఘా, వాలంటీర్ల పర్యవేక్షణ ఉంటుందన్నారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే చర్యలు తప్పవన్నారు. ప్రజా ప్రతినిధులు, ఉత్సవ సమితి ప్రతినిధులు, రాజకీయ నేతలు, ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఉత్సవాలను ప్రశాంతంగా జరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు, తాండూరు తహసీల్దార్ తారాసింగ్, కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, కౌన్సిలర్లు నీరజాబాల్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం, పట్టణ సీఐ సంతోష్ కుమార్, రూరల్ సీఐ అశోక్ కుమార్, హిందూ ఉత్సవ సమితి సభ్యులు. పలువురు రాజకీయ. సంఘాల నాయకులు, విద్యుత్, ఎక్సైజ్ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

