జనపనారలో అంతులేని ప్రోటీన్లు..!
– గుండె జబ్బులను తగ్గించే సామర్థ్యం
– వృద్ధుల ఒంటి సమస్యలకు చెక్
– బాడీలో ఇమ్యూనిటిని పెంచే అద్బుతాలు
దర్శిని డెస్క్ : శరీర ఆరోగ్యం కోసం ఇప్పుడు ఎన్నో రకాలైన ఆహారా పథార్థాలను తీసుకుంటారు. ముఖ్యంగా డ్రైఫ్రూట్స్ అంటే బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, పిస్తాపప్పులు చాలా మంది తీసుకుంటారు. కేవలం ఇవి మాత్రమే కాకుండా ఈ కోటాలో కొత్త రకమైన విత్తనం ఆ జాబితాలో చేరింది. అవే జనపనార విత్తనాలు. ఇంగ్లీష్‌లో వీటిని హెంప్ సీడ్స్ అని పిలుస్తారు. జనపనార గింజలు పోషకమైనవి మరియు ఆరోగ్యకరమైనవి. చూడటానికి చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ జనపనార గింజల్లో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, భాస్వరం, మెగ్నీషియం, కాల్షియం, సల్ఫర్, ఇనుము, జింక్, సోడియం, విటమిన్లు B6, B12, D, E పుష్కలంగా ఉన్నాయి.
రోగనిరోధక శక్తి బలంగా ఉంటే, సీజనల్ వ్యాధులు దాడి చేయవు. ఈ విత్తనాలను తినడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా జనపనార గింజలు తినడం వల్ల కీళ్ల నొప్పులను నివారించవచ్చు. కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఈ విత్తనాలను తింటే త్వరలోనే ఉపశమనం లభిస్తుంది. ఈ విత్తనాలు చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా మంచివి. కాబట్టి, ఈ విత్తనాలను క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది. జనపనార గింజలు తినడం వల్ల కడుపు సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చు. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.
అదేవిధంగా, ఇది ప్రాణాంతక గుండె సమస్యలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జనపనార గింజలను నిత్యం తీసుకోవడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది.శరీర బరువు అదుపులో ఉంటుంది. ఎముకలు బలోపేతం అవుతాయి. బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇక జనపనార గింజలను తృణధాన్యాలు లేదా పెరుగుపై చల్లుకొని తినవచ్చు. వాటర్ లో నానబెట్టి కూడా ఈ సీడ్స్ ను తీసుకోవచ్చు.
ఇదికూడా చదవండి…

