పోరాట యోధుడు సీతారం ఏచూరీ

తాండూరు రాజకీయం వికారాబాద్

పోరాట యోధుడు సీతారం ఏచూరీ
– తాండూరులో నివాళులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : మాక్సిస్టు, మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారాం ఏచూరీ అలుపెరుగని పోరాట యోధుడని బీఆర్ఎస్ నాయకులు, న్యాయవాది గోపాల్ అన్నారు. శుక్రవారం తాండూరులో సీతారాం ఏచూరీ మరణం పట్ల ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా న్యాయవాది గోపాల్ మాట్లాడుతూ సీతారం ఏచూరీ మరణం సభ్య సమాజానికి తీరని లోటని అన్నారు. తన జీవితాంతం అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహాయోధుడు. ఆ మహనీయుని ఆధ్వర్యంలో పనిచేసే సౌభాగ్యం కలిగినందుకు గర్వంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, మహిళలు ఉన్నారు.

ఇదికూడా చదవండి..

కాంగ్రెస్ నియంత పాలన