కాంగ్రెస్ నియంత పాలన

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్ నియంత పాలన
– ప్రజా పాలనలో అక్రమ అరెస్టులు పర్వం
– ఖండించిన బీఆర్ఎస్ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు నియంత పాలన చేస్తుందని తాండూరు బీఆర్ఎస్ నేతలు అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిల వ్యవహారంలో శుక్రవారం తాండూరు పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారు. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, నాయకులు, యువనాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రజా పాలన ముసుగులో నియంత పాలన చేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలను, నాయకులను అరెస్టులు చేయడం అప్రజాస్వామికం అని అన్నారు. మా ఎమ్మెల్యే, పార్టీ నేతలను అరెస్టులను ఖండించారు. సీనీయర్ నాయకులు శ్రీనివాస్ చారి, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం, యువనాయకులు సందీప్ రెడ్డి, దత్తాత్రేయ, హుస్సేన్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి..

వక్స్ బోర్డు భూములను కాపాడుకోవడమే ధ్యేయం