సమాజ దిక్సూచీలు ఉపాధ్యాయులు

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

సమాజ దిక్సూచీలు ఉపాధ్యాయులు
– తాండూరులో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం
– రిటైర్డ్ ఉపాధ్యాయులను సన్మానించిన మార్వాడి యువమంచ్
– ఉత్తమ విద్యార్థులకు బహుమతులతో ప్రోత్సహాం
తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజానికి ఉపాధ్యాయులే దిక్సూచీలుగా నిలుస్తారని మార్వాడి యువమంచ్ సభ్యులు అన్నారు. తాండూరు మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. పట్టణంలోని బాలాజీ మందిర్ లో నిర్వహించిన వేడుకలకు మంచ్ జాతీయ కన్వినర్ సురేష్ జైన్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నేమిచంద్, ప్రగతి సమాజ్ అధ్యక్షులు రమేష్ చంద్రపండిత్, రాజస్థాని నవయువక్ సంఘం అధ్యక్షులు మన్మోహన్ సార్డా, మహిళ మండలి అధ్యక్షురాలు సంతోష్ రాఠీ, మంచ్ అధ్యక్షులు అనిల్ కుమార్ సార్డా, కార్యదర్శి సచిన్ రాఠీ, కోశాధికారి అరుణ్ సార్థా, రాష్ట్ర ఉపాధ్యక్షులు సన్ని అగ్రవాల్, రోహిత్ అగ్రవాల్ ల సమక్షంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు బాలచంద్(తెలుగు అధ్యాపకులు, జెడ్పీహెచ్ఎస్ బషీరాబాద్), మంజుభాషిణీ(సోషల్ | టీచర్, జెడ్పీహెచ్ఎస్ యాలాల), శోభారాణి(ఇంగ్లీష్ టీచర్, శ్రీసరస్వతి శిశుమందిర్ పాఠశాల, తాండూరు), కీర్తిశర్మ(టీపీఎస్ స్కూల్, తాండూరు), సంగప్ప(శ్రీసరస్వతి శిశుమందిర్ పాఠశాల, తాండూరు), శ్రీశైలం గౌడ్ (శ్రీసరస్వతి శిశుమందిర్ పాఠశాల, తాండూరు)లను సన్మానించారు.

అదేవిధంగా వివిధ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి మెధస్సును చాటుకున్న విద్యార్థులకు బహుమతులు అందజేసి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉపాధ్యాయుల కృషితోనే సమాజంలో ఉత్తమ పౌరుల నిర్మాణం జరుగుతుందన్నారు. అందుకే ఉపాధ్యాయులు సమాజానికి దిక్సూచీలుగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నిహార్ సోని, సునీల్డ్ సార్ధా, మంచ్ సభ్యులు, సమాజం పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ఆపరేషన్ స్ట్రీట్ డాగ్..!