ప్రైవేటు ఆసుపత్రిలో ఘోరం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రైవేటు ఆసుపత్రిలో ఘోరం..!
– చికిత్స కోసం వచ్చిన గర్భిణీ కన్నుమూత
– తాండూరు నర్సింగ్ హోంలో ఘటన
– ఆందోళన వ్యక్తం చేసిన కుటుంభీకులు
– నిర్లక్ష్యం లేదన్న వైద్యురాలు, యజమాన్యం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఘోరం జరిగింది. చికిత్స కోసం వచ్చిన ఓ గర్భిణి కన్నుమూసింది. ఈ సంఘటన ఆదివారం తాండూరు నర్సింగ్ హోంలో జరిగింది. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరిలా ఉన్నాయి. తాండూరు పట్టణం ఇందిరానగర్‌ కు చెందిన అక్షిత(21)ను కోస్గి మండలం కొత్తపల్లికి చెందిన రమేష్‌ కు ఇచ్చి వివాహం జరిపించారు. ఇటీవలే అక్షిత మొదటి సారి గర్భం దాల్చింది. ప్రసవం కోసం తల్లిగారి ఇంటికి వచ్చింది.

అప్పటికే అక్షితను పలు ఆసుపత్రిలో చూపించగా గర్భంలో ఉన్న శిశువుకు వెన్నెముక సమస్య ఉందని, శిశువును తొలగించడమే ఉత్తమమని వైద్యులు సలహాలు ఇచ్చినట్లు కుటుంభీకులు తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ క్రమంలో తాండూరులోని ప్రైవేటు ఆసుపత్రి తాండూరు నర్సింగ్‌ హోంలో సంప్రదించారు. ఇక్కడ వైద్యురాలు కూడా అదే సలహా ఇచ్చారు. కుటుంభ సభ్యుల అనుమతితో ఆసుపత్రిలో చేర్పించుకున్నారు.

శనివారం అక్షిత ఆసుపత్రిలో చేరింది. శిశువును తొలగించేందుకు చికిత్స అందిస్తున్నారు. ఆదివారం సాయంత్రం వేళ అక్షిత అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వైద్యులు పరీక్షించగా అప్పటికే అక్షిత మృతి చెందినట్లు నిర్దారించారు. దీంతో కుటుంభీకులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి వైద్యురాలు, యజమాన్యం దీనిపై స్పందిస్తూ వైద్య సేవల్లో నిర్లక్ష్యం చేయలేదన్నారు. చికిత్స పొందే క్రమంలో ఆమెకు గుండె పోటు రావడంతో మృతి చెందినట్లు అనుమానిస్తున్నామని తేల్చి చెప్పారు. ఈ సంఘటన తాండూరులో కలకలం రేపింది.

ఇదికూడా చదవండి…

కానిస్టేబుల్‌కు నివాళులు