వీధి కుక్కలకు ఆపరేషన్లు..!

ఆరోగ్యం క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

వీధి కుక్కలకు ఆపరేషన్లు..!
– డంపింగ్ యార్డులో ప్రత్యేక కేంద్రం
– పరిశీలించిన చైర్ పర్సన్, కమీషనర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ వాసులను కునుకు లేకుండా చేసిన వీధి కుక్కుల నియంత్రణపై మున్సిపల్ యంత్రాంగం దృష్టిసారించింది. ఆదివారం నుంచి పట్టణంలో వీధి కుక్కలను పట్టుకునే కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. పట్టుకున్న కుక్కలను మున్సిపల్ డంపింగ్ యార్డుకు తరలించారు. సోమవారం నుంచి డంపింగ్ యార్డులో పట్టుకున్న వీధి కుక్కలకు ఆపరేషన్లు చేయించారు. ఇప్పటి వరకు పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి దాదాపు 20 కుక్కలను పట్టుకుని డంపింగ్ యార్డుకు తరలించారు.

ఇందులో 12 ఆడ కుక్కలు ఉండగా 8 మగ కుక్కలను గుర్తించారు. ఆడ కుక్కలను వదిలి మగ కుక్కలకు మాత్రమే నియంత్రణ ఆపరేషన్లు చేశారు. హైదరాబాద్, వికారాబాద్ ప్రాంతాలకు చెందిన వైద్య బృందం సహాకారంతో కుక్కలకు ఆపరేషన్లు చేశారు. కుక్కుల ఆపరేషన్ల ప్రక్రియను మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కమీషనర్ విక్రమ్ సింహారెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మాట్లాడుతూ తాండూరు పట్టణంలో వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

పట్టణ వాసులకు కుక్కుల బెడధ రాకుండా దృష్టిసారిస్తున్నామన్నారు. వీధి కుక్కలను తరలించి ఆపరేషన్లు చేయిస్తున్నామన్నారు. మరోవైపు ఆపరేషన్లు చేయించిన కుక్కలకు మూడు రోజులు యానిమల్ కేర్ లోనే ఉంచి తగిన మందులు, ఆహారం పూర్తయిన తరువాత వదిలేస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ శానిటరీ ఇను స్పెక్టర్ వెంకటయ్య, సిబ్బంది ఉన్నారు.

ఇదికూడా చదవండి…

సమ్మోహనం.. వాసవీ మాత రూపం..!