డీఎస్సీలో ప్రత్యేక నోటిఫికేషన్ వేయాలి
– ఎమ్మెల్యేను కలిసిన ఉర్దూ మీడియం అభ్యర్థులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : డీఎస్సీలో ప్రత్యేక నోటిఫికేషన్ వేయించి మిగిలిన పోస్టులలో ఉర్దూ మీడియం అభ్యర్థుల ద్వారా భర్తిచేయించేలా చూడాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని అభ్యర్థులు కోరారు. ఆదివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని డీఎస్సీ -2024 ఉర్దూ మీడియం అభ్యర్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. రిజర్వేషన్ కేటగిరి క్రింద డీఎస్సీ -2024లో ఉర్దూ మీడియం అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేసేలా అభ్యర్థనను ప్రభుత్వం, సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
మిగిలి పోయిన సీట్లకు తిరిగి జనరల్ కేటగిరీ ద్వారా భర్తీ చేసే విధంగా కృషి చేయాలని కోరారు. ఇందుకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తప్పక తీసుకెళతామని, అభ్యర్థులకు న్యాయం జరిగేలా చూస్తామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ ఉర్దూ మీడియం ఉపాధ్యాయ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఖాజా పాష, అబ్దుల్ నాసర్, అబ్రహం, రేహాన్, అస్లాం తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

