గ్రామాల అభివృద్ధికి కృషి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– యాలాల మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాప
యాలాల, దర్శిని ప్రతినిధి : నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం యాలాల మండలం ముద్దాయిపేట, బాగాయి పల్లి, పగిడియాల్ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. రాఘవాపూర్ గ్రామంలో రూ.10 లక్షలతో చేపట్టిన క్రిమిటోరియంను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టిసారించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ సహాకారంతో ప్రత్యేక నిధులతో గ్రామాల్లో మౌళిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందని అన్నారు. సీసీ రోడ్లు, వాటర్ ట్యాంకులు, స్మశాన వాటికలను అభివృద్ధికి నిధులు కేటాయించడం జరుగుతుందని అన్నారు. గ్రామాల్లో అని వసతులు కల్పించి అభివృద్ధి పరచడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశ్వార్ గుప్తా, వైస్ ఎంపీపీ రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ విఠల్ నాయక్, వెంకట్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మల్లా రెడ్డి, నాయకులు రాజు గౌడ్, నర్సిరెడ్డి, గురురాజ్ జోషి రవీందర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, డైరెక్టర్లు అషాన్న, సప్తగిరి గౌడ్, యాదప్ప, రాములు, విక్రంత్, సర్పంచులు కృష్ణయ్యా గౌడ్, బసి రెడ్డి, కవిత, లక్ష్మి దేవి, బస్వరజ్, శివకుమార్, మధుసూధన్ రెడ్డి, పటేల్ రెడ్డి, ఎంపిటిసిలు గరివప్ప, రాములు, ప్రభాకర్ తదతరులు పాల్గొన్నారు.

