హస్తగతం ఎవరికో..!

తాండూరు రాజకీయం వికారాబాద్

హస్తగతం ఎవరికో..!
– రోజు రోజుకు పెరుగుతున్న పోటీ
– రమేష్ మహరాజ్‌కు టిక్కెట్టు డౌటే..?
– అధిష్టానం నిర్ణయంపై ఉత్కంఠ
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తేలిపోవడంతో అప్పుడు అందరి దృష్టి కాంగ్రెస్ పార్టీపై పడింది. అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు రోజు రోజుకు ఆశావాహులు పెరిగిపోతున్నారు. ఈ సారి ఎన్నికల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరి పోటీ చేస్తారని భారీగా ప్రచారం జరిగింది. ఇందుకు తగ్గట్లుగా కాంగ్రెస్ రాష్ట్ర అధిష్టానం కూడా వేచిచూసే దోరణిని ప్రదర్శించింది. మొదటి నుంచి తాండూరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్‌ మహరాజ్ శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మహరాజ్‌లకు కంచుకోటగా పేరుంది. నియోజకవర్గ ప్రజల్లో ఇంకా మహరాజుల క్రేజీ తగ్గలేదు. పార్టీ క్యాడర్, కార్యకర్తల బలం అలాగే ఉంది.

ఇదే సెంటిమెంట్‌లో ఎం.రమేష్‌ మహరాజ్ ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయాలని బలంగా నిర్ణయించుకున్నారు. పలు మార్లు ఒక్క చాన్స్‌ అంటూ ప్రజలతో విజ్ఞప్తి చేశారు. తాజాగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అధిష్టానం బుజ్జగింపుతో కాంగ్రెస్‌లో చేరే నిర్ణయం మానుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. తాండూరు అసెంబ్లీ స్థానం నుంచి రమేష్‌ మహరాజ్‌తో పాటు సంఖ్య పెరిగింది. తాండూరు నుంచి తనకు టిక్కెట్టు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, మరో ప్రధాన కార్యదర్శి రఘువీరారెడ్డితో పాటు మాజీ క్రికెటర్ అజారోద్దీన్‌లు పోటీ పడుతున్నారు. పార్టీ టిక్కెట్టు కోసం పార్టీలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరిణామాల మద్య తాండూరు నియోజకవర్గ టిక్కెట్టు ఎవరికి వరిస్తుందో.. ఎం.రమేష్‌ మహరాజ్‌కు టిక్కెట్టు డౌటేనా.. అంటూ నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని ఉత్కంఠ లో ఉన్నారు.

ఇది కూడా చదవండి..

గ్రామీణ రోడ్లకు కొత్త శోభ..!