సర్వే ప్రశ్నలు చేంజ్..!

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

సర్వే ప్రశ్నలు చేంజ్..!
– వివరాలు నమోదు అందుకే ఆలస్యం
– ఆ మార్పులు ఎంటో తెలుసా..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఇంటింటి కుల సర్వే ప్రశ్నల్లో మార్పులు జరిగాయి. ఈ కారణంగానే సర్వే వివరాల నమోదులో ఆలస్యం జరుగుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ముందుగా 56 ప్రధాన.. కొన్ని ఉప ప్రశ్నలతో మొత్తం 75 రకాలకు సమాధానాలు రాబట్టి గణకులు వివరాలను నమోదు చేయాలని ఆదేశాలున్నాయి. అనుకున్న ప్రకారం ఈ నెల 6 నుంచే సర్వే పత్రాలతో ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు పూరించాల్సి ఉంది. సర్వే పత్రం ప్రశ్నల్లో మార్పులు ఉండటంతో ఫారాలు రాకపోవడం వల్ల ఇళ్ల గుర్తింపునే ప్రస్తుతం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. స్వయం ఉపాధి కింద అడిగే ప్రశ్నకు ఎన్యుమరేటర్లకు ఉపాధి వారీగా కోడ్‌ నెంబర్లను పూరించాల్సి ఉంది. ఈ ప్రశ్న కిందనే దాదాపు 41 రకాల స్వయం ఉపాధి కోడ్‌ నెంబర్లను కేటాయించారు. పురోహితులు, మౌలానా, చర్చిపాస్టర్‌లు అందరిని స్వయం ఉపాధి కిందనే పరిగణించనున్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, టీవీ జర్నలిస్ట్, కెమెరామెన్‌ అందరిని కూడా మీడియా అని స్వయం ఉపాధి కిందనే కేటాయించిన ప్రత్యేక కోడ్‌ నెంబరును పూరిస్తారు. ఇన్సూరెన్స్, ఆర్టీఏ, మెడికల్‌ ఏజెంట్లను సైతం ఇదే కోవలోకి తీసుకొని వారికి మరో కోడ్‌ను కేటాయించారు. ఇక స్విగ్గి, జొమాటో, ఓలా, ఊబర్‌లలో పని చేసే వారిని రోజువారీ వేతనం కింద అసంఘటిత కార్మికులుగా గుర్తించనున్నారు. కాగా ప్రశ్నల వివరాలతో తుది పత్రం (ఫారం) నమూనా అన్ని చోట్ల జిల్లా అధికారులకు పంపించారు. శుక్ర, శనివారాల్లో స్థానికంగానే జిల్లాస్థాయిల్లో వాటిని ముద్రించి ఎన్యుమరేటర్లకు ఇవ్వనున్నారు.

ఇదికూడా చదవండి…

స్మార్ట్ బిల్లింగ్ మిషన్లు..!