కర్ణాటకలో రోడ్డు ప్రమాదం
– కారు, బులేరో ఢీ – నలుగురి మృతి
– డీజీపీ, ఎస్పీ ఆదేశాలతో కరణ్ కోట్ పోలీసులు దర్యాప్తు
– విచారణకు వెళ్లిన ఎస్ఐ విఠల్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా కమలాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బులేరో ఢీ కొనడంతో కారు డ్రైవర్తో సహా నలుగురు మృతి చెందారు. ఈ సంఘటనపై తెలంగాణ డీజీపీ జితేందర్ వి కారాబాద్ జిల్లా ఎస్పీ నారాయరణ రెడ్డిని దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. దీంతో కరణ్ కోట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లాకు చెందిన భార్గవ్ కృష్ణ(55) హైదరాబాద్ లోని యూసుప్ గూడలో ఉంటున్నారు. అయితే కర్ణాటలో ఉన్న వివిధ ప్రాంతాలను చూసేందుకు కుటుంబంతో కలిసి కారులో హైదరాబాద్ నుంచి బయల్దేరారు. కర్ణాటకలోని దత్తాత్రేయ క్షేత్రానికి వెళుతున్నారు.
శనివారం ఉదయం గుల్బర్గా జిల్లా కమలాపురం వద్దకు రాగానే రోడ్డుపై ఎలాంటి డివైడర్లు లేకపోవడంతో ఎదురుగా వస్తున్న బులేరో వాహనం వీరి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్గవ్ కృష్ణతో పాటు ఆయన భార్య సంగీత (45), కుమారుడు ఉత్తమ్ రాఘవ(28), కారు డ్రైవర్ రాఘవేంద్ర గౌడ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ డీజీపీ జితెంతర్ రోడ్డు ప్రమాదంపై దర్యాప్తు చేపట్టాలని కర్ణాటక సరిహద్దు జిల్లా వికారాబాద్ జిల్లా నారాయణ రెడ్డిని ఆదేశించారు. వెంటనే జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి కరణ్ కోట్ పోలీసులను ఆదేశించారు. డీజీపీ, ఎస్పీ ఆదేశాలతో కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి వెంటనే కర్ణాటకలోని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి ఎస్పీ, పోలీసు అధికారులతో సమన్వయం పాటించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బందువులకు సమాచారం అందించి ఎఫ్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేశారు.
ఇదికూడా చదవండి…

