సునితాసంపత్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
– టీఆర్ఎస్ ఉద్యమ కారుడు రంగారవును కూడ
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునితాసంపత్‌ను ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి పరామర్శించారు. సునితాసంపత్‌కు ఇటీవలే మాతృవియోగం కలిగింది. బుధవారం ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి డాక్టర్ సంపత్ కుమార్ నివాసానికి చేరుకుని సునితాసంపత్‌ను పరామర్శించారు. ఆమె తల్లి మరణంపట్ల విచారం వ్యక్తం చేశారు. మరోవైపు తాండూరు టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు, తెలంగాణ ఉద్యమ
కారులు, విద్యా వేత్త వి.రంగారవును కూడ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పరామర్శించారు. రంగారావు చెవికి ఇటీవలే ఆపరేషన్ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వారి నివాసానికి చేరుకున్నారు. రంగారావు, కౌన్సిలర్, మహిళ నాయకురాలు విజయదేవిలను కలిసి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.


