అన్నింట్లో ఐక్యతను చాటుదాం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అన్నింట్లో ఐక్యతను చాటుదాం..!
– ఎస్టీల రిజర్వేషన్లను రద్దు చేస్తే ఊరుకోం
– మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్
– తాండూరులో వైభవంగా మహా భోగ్ పూజ
తాండూరు, దర్శిని ప్రతినిధి : గిరిజనులంతూ అన్నింట్లో ఐక్యతను చాటుకోవాలని తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, వినాయక గ్రూఫ్స్ చైర్మన్ వర్త్యా విఠల్ నాయక్ తో పాటు పలువురు గిరిజన నాయకులు అన్నారు.
kvcs
శ్రావసమాసంలో 30 రోజుల పాటు గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్, భవానీ మాతలకు భోగ్ పూజలు పూర్తి చేసుకున్నారు. ఆదివారం గిరిజన కుటుంబాలతో కలిసి పట్టణంలోని వినాయక ఫంక్షన్ హాల్ లో మహా భోగ్ పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విఠల్ నాయక్ తో పాటు పలువురు గిరిజన నాయకులు, పెద్దలు పాల్గొన్నారు. అనంతరం విఠల్ నాయక్, పలువురు మాట్లాడుతూ గిరిజనులు అందరు ఐక్యంగా ఉండాలన్నారు. అన్నింట్లో రాణించేందుకు కృషి చేయాలన్నారు.

అదేవిధంగా ప్రభుత్వం గిరిజన ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని, ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఎస్టీల జాబితాలో నుంచి లంబాడీలను తొలగించాలని చూస్తున్నారని. అలాంటిది చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గోర్ సిక్వాడి తెలంగాణ కట్మలో, వికారాబాద్ జిల్లా కోఆర్డినేటర్ రాథోడ్ దీపక్ నాయక్, కార్బరీ పరశురాం, గోర్ సేన డివిజన్ కోఆర్డినేటర్ రాందాస్ నాయక్, గోర్ సిక్వాడి శోభతి రాథోడ్ అనిల్, గోపాల్, చందర్, గోపాల్ టీచర్, సంతోష్, హీరాసింగ్, చందర్, శంకర్, శ్రీను, ప్రేమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

మంచోళ్లకు.. ఇంతటి సావా..!