కొత్త మున్సిప‌ల్ కార్యాల‌యంలో ల‌క్ష్మీపూజ‌

తాండూరు వికారాబాద్

కొత్త మున్సిప‌ల్ కార్యాల‌యంలో ల‌క్ష్మీపూజ‌
– తాండూరు మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు మున్సిప‌ల్ కొత్త భ‌వ‌నం నుంచి పరిపాల‌న అందిస్తామ‌ని చైర్ ప‌ర్స‌న్ తాటికొండ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ అన్నారు. శుక్ర‌వారం దీపావ‌ళి పండ‌గ సంద‌ర్భంగా లారీ పార్కింగ్ స‌మీపంలోని కొత్త మున్సిప‌ల్ కార్యాల‌యంలో ల‌క్ష్మీపూజ నిర్వ‌హించారు. మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా నర్సింలు, మాజీ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల ర‌త్న‌మాల న‌ర్సింలు, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడ‌ర్ బొబ్బిలి శోభారాణి, కౌన్సిల‌ర్ల‌తో క‌లిసి వేధ మంత్రోచ్చ‌ర‌ణ‌ల మ‌ద్య పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ త్వ‌ర‌లోనే కొత్త మున్సిప‌ల్ నుంచి అన్ని విభాగాల ద్వారా ప‌రిపాల‌న అందిస్తామ‌ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.