వాకింగ్ చేస్తుంటే అరెస్టు చేస్తారా..!
– నరేందర్ రెడ్డి అరెస్టుపై హైకోర్టు సీరీయస్
– రిజర్వులో.. క్వాష్ పీటీషన్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు విధానంపై తెలంగాణ హైకోర్టు సీరీయస్ అయ్యింది. కేబీఆర్ పార్కు వద్ద వాకింగ్‌కు వెళ్లినప్పుడు ఎందుకు అరెస్టు చేయడాన్ని తప్పు పడుతూ అలా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించింది. నరేందర్‌రెడ్డి పరారీలో ఉన్నారా అని పీపీని ప్రశ్నించింది. ఆయనను ఓ ఉగ్రవాదిలాగా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని నిలదీసింది. అదేవిధంగా దాడికి గురైన అధికారుల గాయాలపై సరిగ్గా నివేదించలేదని, తీవ్రగాయాలైనట్లు రిపోర్టు ఇచ్చి.. చిన్న గాయాలైనట్లు రాశారని తప్పు పట్టింది.
నరేందర్‌రెడ్డి అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలు పాటించలేదని ఉన్నత న్యాయస్థానం ఆక్షేపించింది. మరోవైపు నరేందర్ రెడ్డి రిమాండ్ ఆర్డర్ క్వాష్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. నరేందర్‌రెడ్డి పాత్రపై నమోదు చేసిన వాంగ్మూలాలు ఇవ్వాలని పీపీని ఆదేశించింది. అంతకుముందు నరేందర్ రెడ్డి ప్రజలను రెచ్చగొట్టేలా పీపీ వాదనలో తెలిపారు. ఈ దశలో పిటిషన్‌ను అనుమతిస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతుందున్నారు. రిమాండ్ ఆర్డర్‌ను క్వాష్ చేయాలన్న నరేందర్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు.
ఇదికూడా చదవండి…

