ఈశ్వారాలయ అభివృద్ధికి తోడ్పాటు
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– ఆలయం ముందు సీసీ రోడ్డు పనులు ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని చెరువెంటి ఈశ్వర దేవాలయం అభివృద్ధికి తోడ్పాటు అందించడం జరుగుతుదంని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దేవాలయాన్ని సందర్శించి ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధాన రహదారి నుండి ఈశ్వరుని ఆలయం వరకు నూతనంగా నిర్మించే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అన్నారు. పట్టణంలోని చెరువెంటి ఈశ్వరాలయ అభివృద్ధికి తోడ్పాటు అందించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా సీసీ రోడ్డు పనులు మంజూరు చేయించి ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, కౌన్సిలర్లు అంతారం లలిత, ప్రభాకర్ గౌడ్, సోమశేఖర్, మాజీ కౌన్సిలర్ వాలి శాంతుకుమార్, దేవాలయ కమిటి సభ్యులు జొన్నల బస్వరాజ్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్, నేతలు, కార్యకర్తలు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

