మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే

తాండూరు రాజకీయం వికారాబాద్

మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే
– బీసీ నేత రాజ్ కుమార్, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్
– వర్ధంతిలో నివాళులు అర్పించిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కుల నిర్మూలన కోసం పోరాడిన మహాత్మ జ్యోతిరావు పూలే ఎప్పటికి చిరస్మరణీయుడుగా నిలుస్తారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్,మున్సిపల్ కౌన్సిలర్ ప్రభాకర్‌ గౌడ్‌లు అన్నారు. గురువారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూల వర్ధంతిని నిర్వహించారు. రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం వారు మాట్లాడుతూ సమాజంలో కుల వ్యతిరేకతను రూపుమాపేందుకు మహాత్మ జ్యోతిరావు పూలు కృషి చేసిన సంఘ సంస్కర్త అని అభివర్ణించారు. ఆయన ఆశయ సాధనకు అందరు ముందుండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, మీడియా ఇంచార్జ్ బస్వరాజ్, నాయకులు కోటం సిద్ధలింగం, ప్రేమ్ కుమార్, అజిత్ ఠాకూర్, జోసఫ్, సయ్యద్, రాజు, జాంగీర్, శివ, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

భద్రేశ్వర దేవాలయ చైర్మన్ గా పటేల్ కిరణ్ కుమార్