కేసీఆర్ త్యాగ ఫలం తెలంగాణ
– ఉద్యమ స్పూర్తి అజరామరం
– మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– దీక్షా దివాస్‌కు తరలివెళ్లిన నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ కోసం చావు త్యాగానికి సిద్ధపడిన మాజీ సీఎం కేసీఆర్ వల్ల ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న దీక్షా దివాస్ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. రోహిత్ రెడ్డి జెండా ఊపీ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. అనే నినాదంతో తెగించిన రోజు ఈరోజు అని గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రంపై కేసీఆర్ చిత్తశుద్ది, నిబద్దతో తెలంగాణ రాష్ట్ర సాధ్యమయ్యిందన్నారు.
కేసీఆర్ దీక్షకు, ఉద్యమ కారుల పోరాటానికి కాంగ్రెస్ దిగి వచ్చి ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిందన్నారు. ఆ ఉద్యమ స్ఫూర్తి అజరామరంగా నిలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం బంగారు రాష్ట్రం కోసం కృషి చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో పరిస్థితులు తారుమారు అయ్యాని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీశైల్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ, మహిళ కన్వీనర్ శకుంతల, పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, నాయకులు శ్రీనివాస్ చారి, పట్లోళ్ల నర్సింలు, వెంకట్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ శోభారాణి, కౌన్సిలర్ ఆసిఫ్, మండలాల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, యువనాయకులు ఇంతియాజ్, జావిద్, వివిధ మండలాల నాయకులు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

