మహిళల ఆర్థికాభివృద్దే సర్కారు ధ్యేయం
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– మహిళ శక్తి కింద బ్యూటీ పార్లర్ ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : మహిళలను ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకరావడమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా ఇందిర మహిళ శక్తి కార్యక్రమం ద్వారా తాండూరు పట్టణం లక్ష్మీ స్వయం సహాక సంఘానికి చెందిన మహిళ పి. జోష్ణకు రూ.3లక్షల రుణం మంజూరయ్యింది. దీంతో ఆమె పట్టణంలో బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసుకుంది. మంగళవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బ్యూటీ పార్లర్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహార్ రెడ్డి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందన్నారు. ఇందిర మహిళ శక్తి ద్వారా మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తుందన్నారు. ఈ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, ఐకేపీ అధికారులు, ఆర్పీలు తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

