అందరు ఆరోగ్యాలపై శ్రద్ధ వహించాలి
– తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– మున్సిపల్ కార్యాలయంలో వైద్య శిబిరం
తాండూరు, దర్శిని ప్రతినిధి : అందరూ ఆరోగ్యాలపై శ్రద్ద వహించాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. ప్రభుత్వ ఏడాది పాలన పూర్తిలో భాగంగా పట్టణంలోని మున్సిపల్ లో ప్రజా పాలన వి జయోత్సవాలు జరుగుతున్నాయి. మంగళవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, ఆర్పీలు, కార్మికులు, సిబ్బందికి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. బస్తీ దవాఖాన వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరంలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, మేనేజర్ నరేందర్ రెడ్డి, పలు విభాగాల అధికారులు పరీక్షలు చేయించుకున్నారు.
ఉదయం నుంచి వైద్య శిబిరంలో అందరికి బీపీ, షుగర్, ఫీవర్, డెంగ్యూ తదితర పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మాట్లాడుతూ ప్రజా పాలనలో భాగంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజల కోసం పనిచేసే అధికారులు, కార్మికులు, ఆర్పీలు అందరు వారి ఆరోగ్యాలపై శ్రద్ధ వహించాలన్నారు. ఇలాంటి వైద్య శిబిరాలలో అనారోగ్య సమస్యలు ఉంటే వైద్య సేవలను సద్వనియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బస్తీ దవాఖాన వైద్యులు, ఏఎన్ఎంలు, అధికారులు, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

