వసతి గృహాన్ని సందర్శించిన తాండూరు న్యాయమూర్తి

తాండూరు రాజకీయం వికారాబాద్

వసతి గృహాన్ని సందర్శించిన తాండూరు న్యాయమూర్తి
– అస్వస్థత సంఘటనపై వివరాల ఆరా
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ లోని గిరిజన బాలికల వసతి గృహాన్ని జూనియర్ సివిల్ జడ్జీ న్యాయమూర్తి శివలీల సందర్శించారు. గత రెండు రోజులుగా హాస్టల్ కు చెందిన విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం న్యాయమూర్తి శివలీల వసతి గృహాన్ని సందర్శించారు. హస్టల్లో చికిత్స పొందుతున్న లీలావతీ అనే విద్యార్థినితో మాట్లాడారు. మిగతా వి ద్యార్థులతో కూడా మాట్లాడి హాస్టల్లో అందిస్తున్న భోజనం, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైన కారణాలను ఆరా తీశారు. న్యాయమూర్తి వెంట బార్ అసోసియేషన్ నాయకులు, న్యాయవాదులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

విద్యార్థులందరికి మెరుగైన వైద్యం