దేవాలయ భూముల రక్షణ బాధ్యత
– ఎండోమెంట్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్
– కందనెల్లి అభయాంజనే స్వామి భూముల పరిశీలన
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : దేవాలయ భూముల రక్షణకు బాధ్యతగా ఉండాలని దేవాదాయ శాఖ అధికారి ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం పెద్దేముల్ మండలం కందనెల్లి అభయాంజనేయ ఆలయ భూమి, దేవాలయాన్ని ఆయన పరిశీలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని ఆలయాలను సందర్శించి ఆలయ భూముల రక్షణ, ఆలయాల్లో ధూపదీప నైవేద్యం ఆలయ పరిశుభ్రత ను పరిశీలించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

ఆలయ భూమి రికార్డుల ప్రకారం విస్తీర్ణం ఉందా లేదా రక్షణ చర్యలు ఏమి తీసుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. గుడి భూమిని పరిశీలించిన ఆయన సర్వే చేసి హద్దులు పాతడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇదే తరహా లో అన్ని ఆలయాల భూములు సర్వే చేయించుకుని హద్దులు పాతి రక్షణ కంచెలు ఏర్పాటు చేయించుకోవాలని సూచించారు. ఆలయ కమిటీ చైర్మన్ గాండ్ల శివకుమార్, పూజారి తమ్మలి శ్రీనివాస్, రాజేశ్వర్ స్వామి, హన్మంత్ రెడ్డి, జంగం బుడ్డయ్య స్వామి ఉన్నారు.

ఇదికూడా చదవండి…

