రాజీవ్ స్వగృహాలో ‘ఓపెన్’ ఆఫర్..!
– ప్లాట్ చదరపు గజం ధర తగ్గింపు
– రేపు, ఎల్లుండి బహిరంగ వేలం
– ప్రకటించిన తాండూరు డివిజన్ అధికారి
తాండూరు, దర్శిని ప్రతినిధి: జిల్లాలోని తాండూరు ప్రజలకు రాజీవ్ స్వగృహ ద్వారా ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. హైదరాబాద్ రోడ్డు మార్గంలోని యాలాల మండలం కోకట్ పరిధిలో ఉన్న రాజీవ్ స్వగృహలోని ఓపెన్ ప్లాట్లకు సంబంధించి చదరపు గజం ధరను తగ్గించినట్లు అధికారులు ప్రకటించారు. గురువారం తాండూరు డీవిజన్ అధికారి పేరుతో ప్రకటన కూడ విడుదల చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు సొంత ఇళ్లు అందించాలనే ఉద్దేశంలో రాజీవ్ స్వగృహ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా తాండూరు పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో మనోహా టౌన్‌షిఫ్ ద్వారా రాజీవ్ స్వగృహ ప్లాట్లను నిర్మించింది. అప్పట్లో ఆర్థిక ఇబ్బందులు రావడంతో ప్రభుత్వం పథకాన్ని అమలును వదిలేసింది. తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ స్వగృహ ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. గత యేడాది కూడ రాజీవ్ స్వగృహలో ఉన్న 72 ఇండ్లలో 17 ఇండ్లకు బహిరంగ వేలం నిర్వహించారు. అప్పట్లో చదరపు గజం ధర ఓపెన్ ప్లాట్‌కు రూ. 10వేలు, కన్‌స్ట్రక్షన్ ప్లాట్ గజం ధర రూ. 11 వేల నుంచి 14 వేల వరకు నిర్ణయించారు. దీంతో అప్పటి బహిరంగ వేలంకు స్పందన రాలేదు. తాజాగా ఈ యేడాది రాజీవ్ స్వగృహలో 68 ప్లాట్లకు బహిరంగ వేలం వేయాలని నిర్ణయించారు.
గజం ధర అధికంతో.. స్పందన అంతంతే
ఈ యేడాది కూడ రాజీవ్ స్వగృహలో సమస్యలు లేని 54 ప్లాట్లతో పాటు 14 ప్లాట్లకు బహిరంగ వేలం వేయాలని నిర్ణయించారు. ఈనెల 17, 18వ తేదిలలో బహిరంగ వేస్తన్నట్లు రెండు విడతలుగా ఫ్రీబిడ్ సమావేశాలు నిర్వహించారు. మొదటిసారి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో గజం ధర రూ. 10 వేలను తగ్గించాలని ఔత్సహికులు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. గతంలో కూడ ధర అధికంగా ఉందనే వేలంలో పాల్గొనేలేదని గుర్తుచేశారు. రెండో విడతలో కూడ ఇదే అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
చదరపు గజం ధర తగ్గింపు
ఈ నేపథ్యంలో గురువారం అధికారులు విడుదల చేసిన ప్రకటనలో రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ల చదరపు గజం ధర తగ్గించినట్లు తెలిపారు. చదరపు గజం ధర రూ. 7,500లకు తగ్గించినట్లు ప్రకటించారు. శుక్రవారం, శనివారం రోజులలో ఉదయం 11 గంటలకు హైదరాబాద్ రోడ్డు మార్గం మనోహా టౌన్‌షిఫ్‌లో ప్లాట్ల బహిరంగ వేలం ఉంటుందని తెలిపారు. ఈ వేలంలో ఔత్సహికులు పాల్గొని ప్లాట్లు సొంతం చేసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అధికారులు విడుదల చేసిన ప్రకటనలో ధరలు ఇలా ఉన్నాయి.. కింద చూడండి..


