అట్టహాసంగా ఎమ్మెల్యే బీఎంఆర్ కప్..!
– ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని పిలుపు
– ప్రతిభావంతమైన క్రీడాకారులకు ప్రోత్సహం అందిస్తామన్న ఎమ్మెల్యే
– టోర్నమెంట్లో 50 స్కూళ్ల నుంచి 2వేల మంది పోటీ
– ఈనెల 11వ తేదీ వరకు ఖోఖో, కబడ్డీ పోటీలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే బీఎంఆర్ కప్-2025 టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమయ్యింది. బుధవారం తాండూరు పట్టణం గౌతమి మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన టోర్నమెంట్ పోటీలను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్థానిక నేతలతో కలిసి ప్రారంభించారు. తాండూరు నియోజకవర్గంలోని జెడ్పీహెచ్ఎస్ విద్యార్థుతో పాటు పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలు మొత్తం 50 స్కూళ్ల నుంచి సుమారు 2100 మంది విద్యార్థులు పోటీకి హాజరయ్యారు. ఆయా పాఠశాలల విద్యార్థుల నుంచి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించి టోర్నమెంట్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. గ్రామీణ స్థాయి, పట్టణ స్థాయిలో విద్యార్థుల ప్రతిభను గుర్తించాలనే ఉద్దేశంతో టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యమిస్తూ గత నెలలో సీఎం కప్ పోటీలను నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. క్రీడల్లో ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తోడ్పాటు అందిస్తామన్నారు. ఈ టోర్నమెంట్ ద్వారా విద్యార్థుల్లో స్నేహం. నైపుణ్యం, పట్టుదల, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు దోహద పడుతుందని అభిలాషించారు. క్రీడల్లో గెలుపు, ఓటములను సాధారణంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. అంతకుముందు టోర్నమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్య, క్రీడా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ టోర్నమెంట్ పోటీలు ఈనెల 11వ తేది వరకు కొనసాగుతాయని నిర్వహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, కోట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, రవి, వెంకన్న గౌడ్, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల నాయకులు డా. సంపత్ కుమార్, ఉత్తమ్ చంద్, జిల్లా మహిళ అధ్యక్షురాలు శోభారాణి, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, బషీరాబాద్ పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, మహిపాల్ రెడ్డి, లొంక నర్సింలు, అక్బర్ బాబ, కావలి సంతోష్ కుమార్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్, మండలాల విద్యాధికారులు, పీడీలు, ప్రైవేటు స్కూల్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

