ఆర్టీసీ డీఎం సమత బదిలీ

తాండూరు రాజకీయం వికారాబాద్

ఆర్టీసీ డీఎం సమత బదిలీ
– కొత్త డీఎంగా కె. సురేష్ కుమార్
– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్టీసీ డీఎం సమత బదిలీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం పలు డీపో మేనేజర్లను బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో భాగంగా తాండూరు ఆర్టీసీ డిపో మేనేజర్ సమతకు స్థాన చలనం కల్పించారు. దాదాపు రెండేళ్ల నుంచి తాండూరు ఆర్టీసీ డిపో మేనేజర్ గా సమత విధులు నిర్వర్తిస్తున్నారు. డిపో అభివృద్ధికి ఆమె ఎంతో కృషి చేశారు.

 

తాండూరు ఆర్టీసీ డిపోలో సంస్థకు, ప్రయాణికులకు అందించిన సేవలకు రాష్ట్ర స్థాయిలో అవార్డులు అందుకున్నారు. రెండు, మూడు ఘటనలో విమర్శలు, ఆరోపణలు వచ్చినా ఎదుర్కొన్నారు. మరోవైపు తాండూరు నుంచి బదిలీ అవుతున్న సమత స్థానంలో కొత్త డిఎంగా కె. సురేష్ కుమార్ నియామకం అయ్యారు. ఉప్పల్ డిపో నుంచి ఆయనను తాండూరుకు బదిలీ చేశారు.

 

 

ఇదికూడా చదవండి…

చిలుక వాగు చిక్కులు తొలగేనా..!