యాలకుల వాటర్ ఎంత బెటరో తెలుసా..?

ఆరోగ్యం జాతీయం తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

యాలకుల వాటర్ ఎంత బెటరో తెలుసా..?
– శరీరంలో విషాన్ని శుభ్రం చేసే అద్భుత గుణాలు
– ఉదయాన్నే తాగితే మానసిక ఒత్తిడి దూరం
– మూత్రపిండాలు, లీవర్ హెల్త్‌కు బెస్ట్ మిడిసిన్‌
దర్శిని డెస్క్ : ఈ మద్య కాలంలో లెమన్‌ టీ, బ్లాక్ టీ, బ్లాక్ కాపీ అంటూ పలు రకాల డిటాక్స్‌ వాటర్‌కు అలవాటు పడుతున్నారు. అయితే యాలకుల వాటర్‌ను కూడా అలవాటు చేసుకుంటే శరీరానికి అద్బుత ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. యాలకులు అంటే వంటల్లో ఉపయోగించడమే కాకుండా ఆరోగ్య రక్షణకు కూడా వినియోగించుకోవచ్చు. ఈ యాలకులు మన ఆరోగ్యానికి కూడా దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఆకుపచ్చ యాలకులు ఫైబర్, ఇనుము, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, అనేక యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇది శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అయితే లెమన్‌ టీ, బ్లాక్ టీ, బ్లాక్ కాపీల మాదిరిగా యాలకుల వాటర్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకుందాం.

రెండు పచ్చి ఏలకులను నీటిలో వేసి మరిగించి తాగడం వల్ల శరీరం, మనస్సు ప్రశాంతంగా ఉంటాయి. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఉదయం కాఫీ లేదా టీకి బదులుగా ఖాళీ కడుపుతో ఏలకుల నీటిని తాగడం వల్ల జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, గుండెల్లో మంట, అజీర్ణం నివారిస్తుంది. మీరు బరువు తగ్గాలంటే ఉదయాన్నే ఖాళీ కడపుతో యాలకుల నీరు తాగడం మంచి పరిష్కారం అంటున్నారు నిపుణులు. ఇది జీవక్రియను పెంచుతుంది. శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును కాల్చడంలో సహాయపడుతుంది. ఈ నీటిని తాగడం వల్ల శరీరంలోని మెటబాలిజం మెరుగై, అదనపు క్యాలరీలను కరిగించి, త్వరగా శరీర బరువులో మంచి మార్పు వస్తుంది.

పచ్చి ఏలకుల నీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. ఇది బ్యాక్టీరియాను చంపడం ద్వారా నోటిని రిఫ్రెష్ చేస్తుంది. అంతేకాదు..ఉదయం ఖాళీ కడుపుతో ఏలకుల నీటిని తాగడం వల్ల శరీరం నుండి టాక్సిన్స్, అదనపు నీటిని బయటకు పంపి, శరీరాన్ని శుభ్రపరచడానికి, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. యాలకులలోని గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తాయి. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. ఇది మూత్రపిండాలు, కాలేయాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.

ఇది కూడా చదవండి….

గేమ్ చేంజర్‌ను బాయ్‌కాట్‌ చేస్తాం..!