సామాన్యులకు శుభవార్త
– తగ్గిన పామాయిల్ ధర
– దిగివచ్చిన పప్పు దినుసులు
దర్శిని డెస్క్ : దసరా పండగ సమయంలో కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు శుభవార్త చెప్పింది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ధరలను తగ్గిస్తూ ఊరట కలిగించింది. గత సెప్టెంబర్ నెలలో సుమారు 11 రకాల నిత్యావసర వస్తువుల ధరలను మోదీ సర్కార్ తగ్గించింది. ఆయా వస్తువులపై 2 నుంచి 11 శాతం వరకు ధరలను తగ్గించింది. గ్లోబల్ ధరలు పతనం, దిగుమతి సుంకాలు తగ్గడంతో.. దేశీయంగా ఆహార, చమురు, వంట నూనె ధరలు తగ్గుముఖం పట్టాయని ఆహార మంత్రిత్వ శాఖ పేర్కొంది. తగ్గిన వస్తువుల ధరలను వివరిస్తూ కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు.
ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
నిత్యావసర వస్తువులు సెప్టెంబర్ 2వ తేదీ తగ్గింపు శాతం అక్టోబర్ 2వ తేదీ
పామాయిల్ రూ. 132 11 శాతం రూ. 118
వనస్పతి నెయ్యి రూ. 152 6 శాతం రూ. 143
సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ. 176 6 శాతం రూ. 165
సోయాబీన్ ఆయిల్ రూ. 156 5 శాతం రూ. 148
ఆవనూనె రూ. 173 3 శాతం రూ. 167
వేరుశెనగ నూనె రూ. 189 2 శాతం రూ. 185
ఉల్లిపాయ రూ. 26 8 శాతం రూ. 24
బంగాళదుంప రూ. 28 7 శాతం రూ. 26
పప్పు దినుసులు రూ. 74 4 శాతం రూ. 71
మసూర్ దాల్ రూ. 97 3 శాతం రూ. 94
మినపపప్పు రూ. 108 2 శాతం రూ. 106

