తాండూరులో ఒక కరోనా కేసు
– ఇందిరమ్మ కాలనీ వాసికి పాజిటివ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులో ఒక కరోనా కేసు నమోదయ్యింది. ఇందిరమ్మ కాలనీకి చెందిన ఓ మహిళకు పాజిటివ్ నిర్దారణ అయినట్లు జిల్లా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. గత కొంత కాలంగా తాండూరులో కరోనా కేసులు నిలకడగా ఉన్నాయి.
ఈనెలలో కరోనా పాజిటివ్ నమోదు కావడం ఇది రెండో సారి. ఈనెల మొదట్లో సాయిపూర్‌కు చెందిన ఓ మహిళకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. తాజాగా బుధవారం జిల్లా ఆసుపత్రిలో 38 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఇందిరమ్మ కాలనీకి చెందిన మహిళకు పాజిటివ్ నిర్దారణ అయ్యింది. దీంతో జిల్లా ఆసుపత్రి వైద్యులు ఆమెను ఐసోలేషన్‌లో ఉంచాలని కుటుంభీకులకు సూచించారు. ఇదిలా ఉండగా ఆసుపత్రి వైద్యులు కరోనా ఇంకా పూర్తిగా తగ్గలేదని, ప్రజలు మాస్కులు ధరించాలన్నారు. శానిటైజర్ వినియోగిస్తూ భౌతిక దూరం పాటించాలని సూచించారు. కరోనా నియంత్రణ కోసం కొవిడ్ టీకా ఫస్ట్, సెకండ్ డోసులు వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
