వ్యక్తి హత్యకేసులో నిందితుడి రిమాండ్

క్రైం తాండూరు వికారాబాద్

వ్యక్తి హత్యకేసులో నిందితుడి రిమాండ్
– వివ‌రాలు వెల్ల‌డించిన రూరల్ సీఐ జలంధర్ రెడ్డి
తాండూరు రూరల్, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామంలో చోటు చేసుకున్న వ్యక్తి హత్య కేసులో నిందితుడు పోలీసులు ముందు లొంగిపోయాడు. నిందితున్ని న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండు తరలించినట్లు రూరల్ సీఐ జలంధర్ రెడ్డి తెలిపారు. మంగళవారం సీఐ జలంధర్ రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. ఆదివారం రాత్రి బషీరాబాద్ మండలం ఎక్కాయి గ్రామంలో నాగప్ప’ అనే వ్యక్తికి అదే గ్రామం ఇంటిపక్కనే ఉండే నాగప్ప అనే వ్యక్తికి స్థలం విషయంలో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో దాడి చేయడంతో వికలాంగుడైన నాగప్ప మృతి చెందాడు. అప్పటి నుంచి నిందితుడు నాగప్ప పరారీలో ఉండిపోయాడు. మంగళవారం ఉదయం బషీరాబాద్ పోలీస్టేషన్లో లొంగిపోయాడు. ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి కేసు విచారణ అధికారిగా ఉన్న తాండూరు రూరల్ సీఐ జలంధర్ రెడ్డికి సమాచారం అందించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని తాండూరు మున్సిఫ్ కోర్టులో న్యాయమూర్తి హాజరు పరిచి రిమాండ్ కు తరలించినట్లు సీఐ జలంధర్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో బషీరాబాద్ ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.