కుక్కను కాపాడిన ఆవు
– వేధించిన వ్యక్తి తగిన శాస్తి
దర్శిని డెస్క్ : పక్కింటి వాళ్లు మరో పక్కింటి వాళ్లతో ఘర్షణ పడేటప్పుడు.. వివిధ కారణాలతో ఎవరైనా కొట్టుకుంటే అందరు అసక్తిగా తిలకిస్తారు. అలాంటి సమాజంలో బతుకుతున్నం మరి. మనషుల్లో మానవత్వం లేకున్నా.. అక్కడక్కడా మూగజీవాలు గుర్తుచేస్తుంటాయి. సరిగ్గా ఇలాంటి సంఘటనకు సంబంధించి ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. కుక్కను వేధిస్తున్న ఓ వ్యక్తిని ఓ ఆవు తన కొమ్ములతో కుమ్మేసీ కాపాడింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి సుశాంత నంద పోస్ట్ చేసిన
ఈ వీడియోలో ఓ వ్యక్తి రోడ్డుపై ఉన్న కుక్కను హింసిస్తున్నాడు. దాని చెవులను పట్టుకొని పైకి లాగుతూ హింసిస్తున్నాడు. దాంతో నోరులేని ఆ మూగజీవం బాధపడలేక అరుస్తున్నది. ఓ మూర్ఖుడి చేతిలో హింసకు గురవుతున్న కుక్కకు గమనించిన ఓ ఆవు.. వెంటనే వచ్చి ఆ వ్యక్తిని కుమ్మింది. తన రెండు కొమ్ములతో ఆ వ్యక్తిని పైకి లేపి కింద పడేసి గాయపరిచింది.. కర్మ ఫలం అనుభవించక తప్పదంటూ అటవీ శాఖ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసాడు. ‘మనుషులకన్నా మూగజీవాలు నయం’, ‘కర్మఫలం అనుభవించాల్సిందే’.. ‘ఒక మూగజీవి బాధ మరో మూగజీవికే అర్థం అవుతుంది’.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మూగజీవాలను హింసించొద్దని ఆవు నేర్పిన పాఠం.. మనకందరికీ గుణపాఠం కావాలని పలువురు అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.
Karma 🙏🙏 pic.twitter.com/AzduZTqXH6
— Susanta Nanda (@susantananda3) October 31, 2021
pic.twihttps://twitter.com/i/status/1454788415396859909


