మారని మందుబాబులు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

మారని మందుబాబులు..!
– పట్టుబడిన ఇద్దరికి జైలు
– మరో 11 మందికి జరిమాన
తాండూరు, దర్శిని ప్రతినిధి : మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి పోలీసులు జైలు శిక్ష, జరిమానాలు విధించినప్పటికి మార్పు రావడం లేదు. పోలీసులు తనిఖీలు నిర్వహించి.. మందుబాబులపై కేసులు నమోదు చేస్తున్నారు. పట్టుబడిన వారికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి జరిమానాలు, జైలు శిక్షలు విధిస్తున్నారు. తాజాగా మరో ఇద్దరు మందు బాబులకు జైలు శిక్ష, జరిమాన విధించినట్లు, మరో 11 మందికి జరిమానాలు విధించినట్లు తాండూరు పట్టణ సీఐ సంతోష్‌ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఇటీవల నిర్వహించిన వాహనాల తనిఖీలో మద్యం సేవించి పట్టుబడిన రాజీవ్ కాలనీకి చెందిన లారీ డ్రైవర్ మంగలి రాములు, తాండూరు మండలం చెంగోల్ గ్రామానికి చెందిన నర్సింలులను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా మంగలి రాములుకు 5 రోజులు జైలు శిక్ష, రూ. 1000 వెయ్యి జరిమాన, నర్సింలుకు 2 రోజులు జైలు శిక్ష, రూ. 1000 జరిమాన విధించినట్లు వెల్లడించారు. అదేవిధంగా మరో 11 మంది మందుబాబులకు రూ. 1000 జరిమాన విధించినట్లు సీఐ తెలిపారు. మరోవైపు వాహనాలు నడిపిస్తున్న 8 మంది మైనర్లు, వాహనాల యజమానులకు ఒక్కక్కరికి రూ. 2500ల జరిమాన విధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపినా, మైనర్లకు వాహనాలు అందించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదికూడా చదవండి…

చెరుకు డబ్బాలపై కొరడా..!