పేద ప్రజల సంక్షేమ‌మే టీఆర్ఎస్ ధ్యేయం..!

తాండూరు వికారాబాద్

పేద ప్రజల సంక్షేమ‌మే టీఆర్ఎస్ ధ్యేయం..!
– టీఆర్ఎస్‌తోనే గ్రామాల అభివృద్ధి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి
– కొర్విచేడ్‌లో టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయ‌కులు
బ‌షీరాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: పేద‌ల సంక్షేమ‌మే టీఆర్ఎస్ ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌ని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం తాండూరు నియోజ‌క‌వ‌ర్గం బ‌షీరాబాద్ మండ‌లంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తాండూరు మాజీ ఎమ్మెల్యే నారాయ‌ణ, టీఆర్ఎస్ నాయ‌కులు పి.శ్రీ‌శైల్‌రెడ్డిల‌తో క‌లిసి ప‌ర్య‌టించారు. మండ‌లంలోని కోర్విచేడ్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నారాయ‌ణ‌రావు స‌మ‌క్షంలో పీఏసీఎస్ డైరెక్టర్ నవీన్ రెడ్డి, యువజన సంఘం నాయకుడు శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన పలువురు యువకులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు సూచనలు సలహాలతో బషీరాబాద్ మండలాన్ని అభివృద్ధి
చేస్తామ‌న్నారు. గ్రామాల్లో సిసి రోడ్లు, మురుగు కాల్వలు, పానాది రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేయిస్తామ‌న్నారు. దీంతో పాటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ రైతు బంధు, రైతు బీమా, పెన్షన్లు, మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికి తాగునీరు లాంటి అనేక పథకాలను టిఆర్ఎస్ పార్టీ ప్రవేశ పెట్టి పేద‌ల సంక్షేమానికి పెద్ద పీట వేసింద‌న్నారు. మాజీ ఎమ్మెల్యే నారాయ‌ణరావు, శ్రీ‌శైల్ రెడ్డిలు మాట్లాడుతూ పేద‌ల సంక్షేమ‌మే టీఆర్ఎస్ ధ్యేయ‌మ‌ని, టీఆర్ఎస్‌తోనే గ్రామాల అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.