వీధి కుక్క వీరంగం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

వీధి కుక్క వీరంగం..!
– దాడిలో 9 మందికి గాయాలు
– తాండూరు పట్టణంలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : వీధి కుక్క వీరంగం చేసి.. 9 మందిపై దాడి చేసింది. ఈ దాడిలో బాధితులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం తాండూరు పట్టణం తులసీనగర్ లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ఉదయం కాలనీలో తిరిగే ఓ వీధి కుక్క అకస్మాత్తుగా స్థానికులపై దాడికి తెగబడింది. పెద్దలు, మహిళలు, చిన్నారులపై దాడి చేసి గాయపరిచింది. ఈ దాడిలో దాదాపు 9 మంది గాయాలపాలయ్యారు. గమనించిన స్థానికులు మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వీధి కుక్కను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు గాయపడిన బాధితులు పట్టణంలోని జిల్లా ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందారు. అదృష్ట వశాత్తు ఎవ్వరికి పెద్ద గాయాలు కాలేదు. దీంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదికూడా చదవండి…

ఢిల్లీ దాకా ఉద్యమిద్దాం..!