వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
– మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి
– సాయిపూర్లో ఎస్టీ హాస్టల్ సందర్శన
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రతి విద్యార్థిని వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి సూచించారు. శుక్రవారం తాండూరు పట్టణం సాయిపూర్ లోని గిరిజన బాలికల వసతిగృహాన్ని కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నామాల నర్సింలు సందర్శించారు. గత కొన్ని రోజుల క్రితం ఇదే హాస్టల్లో విద్యార్థినిలు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మున్సిపల్ కమీషనర్ హాస్టల్ ను సదంర్శించి పరిసరాలను పరిశీలించారు. బాలికలతో మాట్లాడి భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అప్పుడే రోగాలు దరిచేరవని అన్నారు. పరీక్షలు దగ్గర పడుతుండడంతో విద్యార్థులు చక్కగా చదువుకోవాలన్నారు. పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

