శివ పార్వతుల కళ్యాణ వైభోగం..!
– వైభవంగా ధ్వజస్థంబం, కలశ ప్రతిష్టాపన
– అంతారం గ్రామ శివారు శివాలలయంలో ఆధ్యాత్మిక శోభ
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం అంతారం గ్రామ శివారు.. పెద్దేముల్ రోడ్డు మార్గంలోని శివాలయంలో శివ పార్వతుల కళ్యాణ వైభోగం సంతరించుకుంది. మహ శివరాత్రి సందర్భంగా బుధవారం దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్థంభ ప్రతిష్టాపన, కలశ ధారణ భక్తిశ్రద్దలతో వైభవంగా నిర్వహించారు. రాత్రి దేవాలయంలో వేదమంత్రోచ్చరణల మద్య శివ పార్వతుల కళ్యాణం నిర్వహించారు. శివ పార్వతుల కళ్యాణోత్సవం కమణీయతను తలపించింది. శివ భక్తులు భక్తిపారవశ్యంతో ఆలాపించిన భజన కీర్తనలు ఆకట్టుకున్నాయి. ప్రత్యేక పూజా కార్యక్రమాలు, శివ పార్వతుల కళ్యాణోత్సవం, ధ్వజస్థంభ, కలశ ప్రతిష్టాపనలతో దేవాలయ ప్రాంగంణం ఆధ్యాత్మికత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ స్వాములు, శివ స్వాములు, భక్తులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

