దశ తిరగాలంటే.. చేతి గుర్తుకు ఓటేయండి..!
– కాంగ్రెస్ అభ్యర్థి నూర్ అఫ్షామైనా ముమ్మర ప్రచారం
– 35వ వార్డులో ముందుండి నడిపిస్తున్న రొంపల్లి సంతోష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణంలోని వార్డుల దశ తిరిగాలంటే కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయాలని ఆ పార్టీ యువ నాయకులు రొంపల్లి సంతోష్ కుమార్ కోరుతున్నారు.

పట్టణంలోని 35వ వార్డు అభ్యర్థి ఎండీ నూర్ అప్షామైనా గెలుపుకోసం రొంపల్లి సంతోష్ కుమార్ ముమ్మర ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం వార్డు అభ్యర్థి నూర్ అఫ్షామైనాతో పాటు పార్టీ నేతలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలుస్తూ చేతి గుర్తుకు ఓటు వేయాలని సూచించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని.. పార్టీ అభ్యర్థిని గెలిస్తే వార్డు అభివృద్ధి ఖాయమని వివరిస్తున్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో వార్డులో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, ట్యాంకులు అభివృద్ధి పనులు మంజూరు చేయించి ఆదర్శంగా తీర్చిదిద్దుకునే అకవాశం దక్కుతుంని చెబుతున్నారు. వార్డు దశ తిరగాలంటే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

ఇదికూడా చదవండి…

