ఈటెల గెలుపు ప్ర‌జా గెలుపు : సంగీత ఠాకూర్

తాండూరు

ఈటెల గెలుపు ప్ర‌జా గెలుపు
– తెలంగాణ‌లో బీజేపీదే అధికారం
– బీజేపీ కౌన్సిల‌ర్ సంగీత ఠాకూర్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఈట‌ల రాజేందర్‌ను ప్ర‌జ‌లే గెలిపించార‌ని.. ఇది ప్ర‌జా గెలుప‌ని తాండూరు మున్సిప‌ల్ బీజేపీ కౌన్సిల‌ర్ సంగీత ఠాకూర్ అభివ‌ర్ణించారు. మంగ‌ళ‌వారం వెలువ‌డిన హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఈటెల రాజేంద‌ర్ భారీ మెజార్టీతో గెలుపొంద‌డంపై హ‌ర్షం వ్య‌క్తం చేశారు. భారీ మెజార్టితో గెలిపిన ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్ర‌భుత్వం ద‌ళిత బంధుతో పాటు డ‌బ్బుల‌తో ఎన్ని ప్ర‌లోభాల‌కు గురిచేసిన చివ‌ర‌కు ప్ర‌జాస్వామ్యం గెలిచింద‌న్నారు. ఈటెల గెలుపుతో టీఆర్ఎస్ ప‌త‌నం ప్రారంభ‌మ‌య్యింద‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ప్ర‌త్యామ్నాయంగా బీజేపీ నిలిచి తెలంగాణ‌లో అధికారం చేప‌ట్టి తీరుతుంద‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు.