మోక్షదామం.. మహాకుంభమేళా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మోక్షదామం.. మహాకుంభమేళా..!
– జీవితకాలంలో అందరు దర్శించుకోవాలి
– ప్రయోగరాజ్‌లో పుణ్యస్నానాలతో భాగ్యం సిద్ది
– తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : భూలోకంలోని సమస్త మానవాళికి మహాకుంభమేళా మోక్షం కలిగిస్తుందని తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. తాండూరు నుంచి విఠల్ నాయక్ మహాకుంభమేళాకు బయల్దేరి వెళ్లారు. విఠల్ నాయక్ జై భారత్ సేవా సమితి రాఘాపూర్‌కు చెందిన సిద్ది పుర్షా తిప్పయ్య ముత్యతో కలిసి ప్రయాగరాజ్‌లో పుణ్యస్నానాలు చేశారు. ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ గంగా, యమన, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు చేయడం ఎంతో పరమ పవిత్రమన్నారు. ప్రయాగరాజ్ అనే శబ్దాన్ని పలికినంత మాత్రాన్నే సకల పాపాలు పటాపంచలై పోతాయని శాస్త్రం చెబుతోందని పురోహితులు తెలిపారని అన్నారు.

జీవిత కాలంలో ఒక్కసారైనా మహాకంభమేళాలో పుణ్యస్నానాలు చేయాలన్నారు. అందరికి సకల దేవతల కృప సిద్దించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ప్రయాగ రాజ్ నుంచి కాశి, అయోధ్య రామ దర్శనం చేసుకోబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరుకు చెందిన భక్తులు కూడా ఉన్నారు.

ఇది కూడా చదవండి…

ఏండ్ల కల సాకారా దార్శనీకుడు.. మనోహర్ రెడ్డి..!