ఊరికో మేస్త్రీ..!

టెక్నాలజీ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

ఊరికో మేస్త్రీ..!
– ఇందిరమ్మ ఇంటి నిర్మాణంపై శిక్షణ
– శిక్షణ ఇవ్వనున్న గృహ నిర్మాణ శాఖ
– ఏయే అంశాలపై శిక్షణ ఇస్తారంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని ఊరికో మేస్త్రీని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ సర్కారు దృష్టి సారిస్తోంది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలలో లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేదుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు ఎదురయ్యే ఈ ఇబ్బందులను సాధ్యమైనంత తగ్గించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన-గ్రామీణ 2.0 కింద రాష్ట్ర ప్రభుత్వ వాటాతో కలిపి తొలి విడతలో మంజూరు చేసిన 72,045 ఇళ్లను సత్వరం నిర్మించి పూర్తి చేయడానికి పలు పద్ధతులను అమలుచేస్తోంది.

రాష్ట్రంలోని 12,672 గ్రామాల నుంచి ఒక్కో మేస్త్రీని ఎంపిక చేసి.. ఇళ్ల నిర్మాణంపై శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ శిక్షణకు ఒక్కో మేస్త్రీకి రూ.8,500 ఖర్చు చేయనున్నారు. ఈ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 చొప్పున భరించనున్నాయి. హైదరాబాద్‌లోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్‌)లో ప్రస్తుతం ఏడు జిల్లాల పరిధిలో 82 మందికి మొదటి బృందంలో శిక్షణ పూర్తిచేశారు. మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించే గ్రామాలకు ఈ మేస్త్రీలను ఎంపిక చేస్తారు. న్యాక్‌ జిల్లా యూనిట్లలో తదుపరి శిక్షణ ఇస్తారు.

ముఖ్యంగా లబ్ధిదారులపై అదనపు ఖర్చు పడకుండా.. ఒక్కో ఇంటికి కావాల్సిన 8 ట్రాక్టర్ల ఇసుకను ఉచితంగా అందిస్తామని తెలిపింది. మహిళా సంఘాల ద్వారా ఇటుక తయారీ యూనిట్లు ఏర్పాటు చేసి సరఫరా చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. తాజాగా మేస్త్రీలకు శిక్షణపై గృహ నిర్మాణ శాఖ దృష్టిసారించింది. 400 చదరపు అడుగుల ప్లింత్‌ ఏరియాతో ఇంటిని నిర్మించుకోవాలని సూచించిన ప్రభుత్వం.. ఇందుకోసం మూడు నమూనాలను విడుదల చేసింది.

అలానే ఫైల్‌ ఫౌండేషన్, ఓపెన్‌ పౌండేషన్, షార్ట్‌ కాలమ్‌లు, ర్యాట్‌-ట్రాప్‌ మాసన్రీ, ఫిల్లర్‌ రూఫింగ్‌ వంటి కొత్త నిర్మాణ పద్ధతులపై దృష్టిసారించింది. ఈ పద్ధతిలో ఇంటి నిర్మాణం చేపడితే చాలావరకు అదనపు ఆర్థిక భారం లేకుండా చూడవచ్చని అధికారులు అంటున్నారు. ఈ అంశాలపై మేస్త్రీలకు శిక్షణ ఇవ్వనున్నారు. నిర్మాణంలో గట్టితనం, నాణ్యత ఉండేలా ఇంటి నిర్మాణం చేపట్టడం. వ్యయాన్ని తగ్గించడం. సామగ్రి వృథా కాకుండా సద్వినియోగం చేసుకోవడం.. భద్రత తదితర అంశాలపై అవగాహన పెంచడమే ప్రభుత్వ ధ్యేయం.

ఇదికూడా చదవండి…

భద్రేశ్వరున్ని దర్శించుకున్న రూరల్ సీఐ..!