రంజాన్ కు అన్ని సౌకర్యాలు కల్పించాలి
– ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దు
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– పండగ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష
తాండూరు, దర్శిని ప్రతినిధి : ముస్లిం సోదరుల రంజాన్ పండగకు అన్ని సౌకర్యాలు కల్పించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్, పోలీసు, రెవెన్యూ, విద్యుత్ తదితర శాఖల అధికారులతో రంజాన్ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లిం సోదరులు ఎంతో నిష్ఠతో ఉపవాస దీక్షలు చేపడుతారని అన్నారు.

వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మసీదులు, ఈద్గా, ప్రార్థన మందిరాల వద్ద విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యంపై ఎలాంటి ఫిర్యాదు వచ్చినా తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. రంజాన్ సందర్భంగా ఈద్గాల వద్ద ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పండగ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగె లా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, నాయకులు అబ్దుల్ రవూఫ్, తాండూరు తహసీల్దార్ తారాసింగ్, మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, విద్యుత్ ఏడీ శంకర్, పట్టణ సీఐ సంతోష్ కుమార్, ఎస్ఐ రమేష్, మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, జుబేర్ లాల, మైనార్టీ నాయకులు సర్దార్ ఖాన్, యూసుఫ్ ఖాన్, కమల్ అతహర్, అక్బర్ బాబ, అబ్దుల్ ఖవి, పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…


