తాండూరంతా దీపావళి శోభ..
– వైభవంగా లక్ష్మీపూజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గం, పట్టణంలో గురువారం దీపావళి పండుగను ఘనంగా ప్రజలు జరుపుకున్నారు. నరకచతుర్ధశి సంధర్భంగా జరుపుకునే దీపావళి పండుగతో తమ ఇండ్లల్లో, తమ జీవితాల్లో కొత్త
వెలుగులను నింపాలని కోరుకుంటూ ప్రజలు ఎంతో ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు. ఉదయాన్నే లేచి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. నూతన అల్లుడ్లను అత్తగారింటికి పిలిచి దీపావళి కానుకలను
సమర్పించుకున్నారు. అనంతరం తమ తమ ఇళ్లల్లో, వ్యాపార, వాణిజ్య సంస్థల్లో, కార్యాలయాల్లో లకిëపూజలు చేసుకున్నారు. పలు కుటుంబాల్లో ఎంతో పవిత్రమైన నోము పండుగను దీపావళి సందర్భంగా కుటుంబ సభ్యులు, కొత్త అల్లుళ్లు, కోడళ్లు, దూర ప్రాంతాల బంధువుల మధ్య ఆనందంగా జరుపుకున్నారు. తదానంతరం పట్టణంలో పేల్చిన టపాసుల చప్పుళ్లు మారుమోగాయి.
మరోవైపు పండగ వేడుకల్లో ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, సంఘాల ప్రతినిధులు పాల్గొని సందడి చేశారు.
