పేదలకు వైద్య సేవలు అభినందనీయం
– వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్య శిబిరం
– కర్ణాటకలోని కాళికాదేవి జాతర ఉత్సవాలలో వైద్య సేవలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడం అభినందనీయని కల్కి భగవాన్ అన్నారు. ఆదివారం కర్ణాటక రాష్ట్రం చించోల్లి తాలూకా కొరివి తాండాలో జరిగిన కాళికాదేవి జాతర ఉత్సవాలలో తాండూరు వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. జాతరలో ఆసుపత్రి వైద్యులు పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు.

బీపీ, షుగర్, జ్వరం తదితర సమస్యలకు పరీక్షలు చేసి మందులను పంపీణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కల్కీ భగవాన్, సంత్ విఠల్ మహారాజ్ లు ఆసుపత్రి సామాజిక సేవను కొనియాడుతూ అభినందించారు. ఇదేవిధంగా పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డా. మాలాశ్రీ, డా. ఆకాంక్ష, డా. తుకారాం, పవార్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

